భలే ఛాన్సులే......లలలాం లలలాం లక్కీఛాన్సులే!!
ఇల్లరికం సినిమాలోని సరదా పాట - భలే ఛాన్సులే.
ఈ పాట ఎత్తుగడ భలే ఛాన్సులే....అని ప్రారంభం అవుతుంది. భలే ఛాన్స్ అన్న పదబంధాన్ని విస్తృతంగా ప్రచారం లోకి తెచ్చిందీ పాట. తెలుగు భాషలో మంచి అవకాశం అనే అర్థంలో మంచి నుడికారంగా మారిపోయింది ఈ పదం.
తల్లితండ్రులు ఆడపిల్లని ఇంటికి మహాలక్ష్మిగా భావిస్తారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. ఎంత మురిపంగా పెంచుకున్నా ఆ ఆడపిల్ల ఆడపిల్లే కదా...ఓ అయ్యచేతిలో పెట్టాలి అనుకుంటూ ఎంతో సంతోషంగా, మరింత బాధగానూ అమ్మాయిని పెళ్ళిచేసి అత్తారింటికి పంపుతారు. అలా అమ్మాయి అత్తారింటికి కోడండ్రికం వెళ్తుంది.
అయితే కొన్ని రివర్స్ కేసులూ ఉంటాయి. ఒక్కతే కూతురు అమిత గారాబంగా పెంచుకున్నదీ అయితే ఆ అమ్మాయిని అత్తగారింటికి కాపురం పంపడం ఇష్టం లేని తల్లిదండ్రులు అల్లుడిని తమ ఇంట్లోనే అట్టే పెట్టుకునేవారు. పెళ్ళికి ముందే ఈ ఒప్పందానికి సిద్ధపడి తన తల్లిదండ్రులను వదిలి మామగారింట శాశ్వతంగా ఉండడానికి సిద్ధపడివచ్చినవాడే ఇల్లరికం అల్లుడు. అలా వచ్చిన అల్లుడిమీద లోకానికి ఓ చులకన భావం ఉంటుంది.
అత్తమామల తదనంతరం తన భార్యకు చెందబోయే ఆస్తిమీద ఆశతోనే ఈ ఒప్పందానికి సిద్ధపడ్డాడనే భావమే దానికి కారణం.
లోకంలో ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళకి ఎన్ని రకాల అవమానాలు జరగవచ్చునో సూచిస్తూనే, వాటన్నిటినీ పట్టించుకోకుండా, దులపేసుకుని పోతే వచ్చే లాభాలను వివరిస్తూ సాగుతుంది ఈ పాట. మానం మర్యాద, సిగ్గు బిడియం అనే భావాలు వదిలేస్తే మనిషికి ఎంతో సుఖం అంటూ వ్యంగ్యంగా చెప్తూ అటువంటి జీవితంలోని దైన్యాన్ని, హైన్యాన్ని ఎత్తి చూపుతారు.
ఇల్లరికంలో ఎంతో సుఖం ఉందని చెప్తూ, ఆ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని జతగాడికి ఉపదేశం చేస్తుంటాడు ఓ ఇల్లరికం అల్లుడు. ఇల్లరికానికి ఒప్పుకుంటే ఆ ఇంట్లో అత్తమామలకు ఒక్క కూతురే ఉండాలి. అదీ అదృష్ణయోగం అంటే. ఇక ఆ ఇంట్లో ఆ ఆడపిల్లకి తోడపుట్టిన మగపిల్లలెవరూ లేకుండా ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో పెత్తనం అంతా ఆ అల్లుడిగారిదే అవుతుంది. అలాంటి ఇల్లరికం అయితే భలే ఛాన్సు దొరికినట్టే జీవితానికి.
ఇక అలా ఒక్కకూతురే కదా, పెత్తనం చేయడానికి బావమరుదులు లేరు కనుక ఇంటల్లుడిదే కదా అధికారం అని ఆనందంగా ఇల్లరికం సంబంధం ఒప్పుకున్నాక ఏం జరుగుతుందో చెప్తారు కవి. మన ఆంధ్ర దేశంలో అల్లుళ్ళంటే చాలా గౌరవం. అల్లుడు అప్పుడప్పుడే కనిపిస్తాడు. ఏ పండక్కో పబ్బానికో వచ్చి వెళ్తాడు. అందుకని అలా అల్లుడు వచ్చిన రెండుమూడ్రోజులు అత్తమామలు ఇంటిల్లిపాదీ తెగ మర్యాదలు చేస్తారు ఎన్నో పిండివంటలు వండి, వడ్డించి దగ్గరుండి తినిపిస్తారు. తమ ఇంటి వాతావరణాన్ని అల్లుడు మెచ్చుకోవాలని చూస్తారు. అల్లుడి కనుసన్నల్లో ఇంటిల్లిపాదీ మెలగుతారు.
కానీ ఇల్లరికం అల్లుడి రూటే వేరు. ఇల్లరికం అల్లుడు అంటే అత్తారింట్లో రోజూ అక్కడే ఉండే అల్లుడు. అత్తమామల కనుసన్నల్లో బ్రతికే జీవి ఇల్లరికం అల్లుడు. అతిపరిచయముచేత అనాదరణ కలుగు అంటారు భర్తృహరి సుభాషితాలలో. బాగా చందనవృక్షాలతో నిండిఉండే మలయపర్వతం మీద నివసించే భిల్లసతి ఆ చందనపు చెక్కపుల్లలనే వంటకి వాడుతుందిట. అలా రోజూ కనిపించే, ఇంట్లోనే తిరిగే ఈ అల్లుడికి ఏ ప్రత్యేకమర్యాదలు ఉండవు. అలా ఏ మర్యాదలు లేకపోయినా, కేవలం గంజి మాత్రమే పోసినా అల్లుడు తమ అత్తగారింట్లో దాన్ని అమృతంగా భావించాలిట. రోజూ కనిపించే అల్లుడికి షడ్రసోపేతమయిన విందులు ఎవరు చేస్తారు?! అంతేకాక ఒకే చూరు కింద కలిసి బతికే మనుషుల మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. మాటల మధ్యలో అల్లుడి మాటలు నచ్చకపోతే అతనిమీద చులకన భావంతో ఛీ అనో ఛా అనో చికాకు పడితే పడవచ్చు-మామగారో అత్తగారో. ఇవన్నీ భరించి, కనీసం భరిస్తున్నామనే విషయం మర్చిపోయి ఆనందంగా ఉండగలిగే వాడికి ఆ ఇల్లరికం - భలే ఛాన్సే
ఇక అల్లుడి పొడ గిట్టని అత్తగార్లు, మామగార్లు ఉంటారు. అల్లుడు ఏం చేసినా నచ్చదు. తమ ఇంట్లో పొద్దస్తమానం పనీ పాటు లేకుండా ఎదురుగా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి చులకన కూడాను. ఏ చిన్న విషయమో చిలికి చిలికి గాలివానగా మారవచ్చు. అలాంటి సమయంలో ఆ అల్లుడి మొహం చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడక చిరాకు పడి ఇంట్లోంచి పొమ్మనే పరిస్థితి కూడా రావచ్చు. ఇక ఆ గొడవ ముదిరి పాకానపడితే అల్లుడిని ఇంట్లోంచి బయటకి ఈడ్చి పడేసేంత కోపమూ రావచ్చు. కానీ ఇల్లరికం అల్లుడికి ఈ కోపతాపాలను ఖండించే హక్కు లేదు. ఆ ఇంట్లో వారెవరయినా ఏమన్నా అతను పడి ఉండవలసినదే. జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చే పరిస్థితి వస్తే ఎలాగో ఓలాగ ఇంటి చూరు పట్టుకుని వేలాడాలి కానీ వెళ్ళపోవడానికి వీలవదు. ఇక తనకు జరిగే అవమానాలు ఎన్నిరకాలుగానో ఉండొచ్చు. దూషణం అంటే తిట్టడం, భూషణం అంటే గౌరవించడం, తిరస్కారము అంటే అవమానం ఇలా అల్లుడికి ఎన్నిరకాలయిన అనుభవాలో కలగవచ్చు. అలాంటివన్నీ పెద్దలు తనకిచ్చే ఆశీస్సులుగా భావించాలి..ఇల్లరికం అల్లుడు. అలాతామరాకు మీద నీటిబొట్టులా ఓ యోగిలా ఉండగలిగితే, ఉంటే అలాంటి వారికి ఇల్లరికం జీవితం భలే ఛాన్సు అన్నమాట.
ఇక ఇల్లరికం జీవితంలో ఇంత అవమానాలను, హేళనను, తిరస్కారాన్ని పొందుతున్నా ఆ జీవితాన్ని ఎందుకు భరించాలో సూటిగా చెప్తారు ఇక్కడ కవి. అత్తగారింట్లో ఈ విధంగా అణిగి మణిగి ఉంటే ఆ అత్తమామల ఒక్కగానొక్క కూతురు కనుక వారి ఆస్తిపాస్తులన్నీ ఆమెకే అంటే తన భార్యకే కదా దక్కుతాయి. అందువల్ల వారు ఏమన్నా మాట్లాడకుండా పడి ఉండాలిట. పండుగలొస్తే అల్లుళ్ళకి బోల్డు కానుకలిస్తారు మామగారు. ఒకవేళ మామగారు బహు లోభి అయి ఖర్చులు తగ్గించుకుని ఆదా చేసే వాడయిఉంటే, అల్లుడిగా తనకి ఏమాత్రం కానుకలు ఇవ్వకుండా పిసినారిగా ఉన్నా దానికి కూడా సంతోషించాలంటారు. అలా దాచిన ముల్లె యావత్తూ ఆ కూతురుకే, ఆమె భర్తకే అంటే తనకే దక్కుతుంది.కాబట్టే ఏ అవమానాలు ఎదురైనా ఇల్లరికం అల్లుడు వాటిని భరించాలి......
ఈ పాట ఎంతో సరదాగాసాగుతుంది.తల్లిదండ్రులను చూసుకోవలసిన కొడుకుగా తన కర్తవ్యాన్ని పక్కన పెట్టి తన ఆత్మగౌరవాన్ని అత్తారింట్లో తాకట్టు పెట్టి మామగారి స్వార్జితమైన ఆస్తికోసం, దురాశతో జీవించే ఇల్లరికం అల్లుళ్ళకి చురుక్కుమనేలా వ్యంగ్యంతోను. ఆ రకం జీవితంలోని హైన్యాన్ని వివరించి ఆ జీవితాన్ని ఆనందించేవారికి వాతలు పెడతారు కొసరాజుగారు.
మామగారికి బాగా ఆస్తి ఉంది కదా అని, ఏ ఉద్యోగం పనిపాటు చేయనవసరంలేకుండా హాయిగా తిని కూర్చుని
మామగారి ఆస్తికి తేరగా హక్కుదారులు అవుదామనుకునే బద్ధకస్తులయిన అల్లుళ్ళ మెదడుగదుల్లో బూజును దులిపి, పరిణామాలను హెచ్చరికగా చూపిస్తూ ఆలోచింపజేస్తుంది ఈ సరదా పాట. గీతం కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం మాధవపెద్ది సత్యం
స్వరరచన టి.చలపతి రావు
పాట సాహిత్యం
భలేచాన్సులే భలేచాన్సులే
లలలాం లలలాం లక్కీచాన్సులే
భలేచాన్సులే
ఇల్లరికంలో వున్నా మజా...
ఇల్లరికంలో వున్నా మజా..
అది అనుభవించితే తెలియునులే
భలేచాన్సులే...
అత్తమామలకు ఒక్క కూతురౌ
అదృష్ట యోగం పడితే(2)
బావమరుదులే లేకుంటే
ఇంటల్లుడిదేలే అధికారం
భలేచాన్సులే...
గంజిపోసినా అమృతంలాగా
కమ్మగా ఉందనుకుంటే
బహుకమ్మగా ఉందనుకుంటే
ఛీ, ఛా అన్నా చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి
భలేచాన్సులే (ఇల్లరికం)
జుట్టు పట్టుకుని బయటికీడ్చినా
చూరు పట్టుకొని వేలాడీ(2)
దూషణ భూషణ తిరస్కారములు
ఆశిస్సులుగా తలచేవాడికి(భలేచాన్సులే)
అణిగీ మణిగీ ఉన్నామంటే
అంతా మనకే చిక్కేది (2)
మామలోభియై కూడబెట్టితే
మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే
మనకే మా మా మా మనకే
ఇల్లరికం సినిమాలోని సరదా పాట - భలే ఛాన్సులే.
కొసరాజుగారు సినిమాకి పాటలు రాసారూ అంటే నిర్మాతలు ఖచ్చితంగా ఓమంచి హాస్యగీతం రాయించుకోవడం ఎంత రివాజో ఆ గీతాలు ప్రజల నాలుకలపై తరాలపాటు చిందులువేయడం కూడా అంతే రివాజు. ఆ కోవకు చెందినదే ఈ పాట.
ఇల్లరికం సినిమాలో కథ ప్రకారం హీరో ఇల్లరికం ఉండవలసి వస్తుంది. కానీ అతను తన వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి పరీక్షగా మారిన అ అత్తవారి ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు.అయితే కమేడియన్ పాత్రకు పాటరాసేటప్పుడు ఆ పాత్రద్వారా ఈ ఇల్లరికాన్ని అనుభవించడంలో కలిగే బాధలను, అవమానాలను వివరించడానికి హీరోపాత్రను సమర్థించడానికి ఓ మంచి సందర్భంగా దీన్ని ఉపయోగించుకున్నారు కొసరాజు. ఈ విషయాన్ని సూటిగా చెప్పకుండా వ్యంగ్యంతో హాస్యంతో తీపికోటింగ్ అద్ది చక్కని హాస్యగుళికగా ఈ పాటను తయారుచేసారు.కొసరాజు రాఘవయ్యగారి మార్కు పాట ఇది. పాటలో సున్నితమైన హాస్యం, మంచి వ్యావహారికమైన తెలుగు ఇంగ్లీషు కలిసిన పాత్రోచితమైన భాష, చెప్పదలచుకున్న విషయాన్ని చక్కని వ్యంగ్యంతో సరదాగా సాగే వాక్యవిన్యాసంతో చెప్పడం - అదీ కొసరాజు గారి శైలి.

పాట తెలిసిందే, విని సరదాగా నవ్వుకున్నదే. దానికి మీ వివరణ/విశ్లేషన చాలా బావుందండీ.. :-)
రిప్లయితొలగించండిమొత్తానికి ‘సరదా’గా షురూ చేశారూ..
రిప్లయితొలగించండిబోణీపాట అదిరింది..
దురాశతో జీవించే ఇల్లరికం అల్లుళ్లకు చివుక్కుమనేలా... అనన్నారు! నిజమే, ఈ పాట ఆ రోజుల్లో రాబట్టి సరిపోయింది.ఈ రోజుల్లో వచ్చివుంటే, ఇల్లరికపు అల్లుల జేఏసీ ఏర్పడి.. ఖండన, దూషణ, తిరాస్కార, ఆందోళనలు నెలకొనేయేమో! హహ్హా..
ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయి రివర్స్ లో ఉంది కదండీ. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసాక వాళ్ళు ఉద్యోగాలకు పోవాల్సి వస్తే వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు చాకిరీ చేయడానికి, కనిపెట్టుకుని ఉండడానికి మామగార్లే అల్లుండ్రికం పోతున్నారు. కొసరాజు గారుంటే ఇప్పుడు ఏం పాట రాసేవారో.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసరదా పాటలలో ఇల్లరికం చిత్రం లోని ఈ పాటకి విశిష్ట స్థానం ఎప్పుడూ వుంటుంది. ఇలాంటి పాటలకి కొసరాజు గారే న్యాయం చేయగలరు. ఇలాంటి పాటని మీ విశ్లేషణ జోడించి అందించటం బావుంది.
రిప్లయితొలగించండిఇదీ బాగుంది
రిప్లయితొలగించండిExcellent
రిప్లయితొలగించండి